Header Banner

భక్తులకు దర్శన టోకెన్లపై టిటిడి ఈవో కీలక ప్రకటన..! ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం!

  Tue May 06, 2025 19:36        Devotional

తిరుమలలో భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వేసవి రద్దీ వేళ సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ బ్రేక్ దర్శనం పైన కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 15 వరకు బ్రేక్ దర్శనాల కోసం సిఫారసు లేఖలను రద్దు చేసారు. బ్రేక్ దర్శనాల వేళలను మార్పు చేసారు. ఇక, టోకెన్ల పైన సూచించిన సమయానికి క్యూ లైన్లలోకి భక్తులు రావాలని టీటీడీ సూచన చేసింది. ఇప్పుడు మెట్ల మార్గంలో కాలినడకన వచ్చే భక్తులకు టోకెన్ల జారీ పైన ఈవో శ్యామలా రావు కీలక ప్రకటన చేసారు. తిరుమల శ్రీవారి దర్శనార్ధం కాలినడకన వచ్చే భక్తులకు శ్రీవారి మెట్టు మార్గంలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని టిటిడి ఈవో శ్యామలరావు తెలిపారు.

కాలినడకన వెళ్లే మార్గంలో టోకెన్లు పొందేందుకు భక్తులు అసౌకర్యానికి గురౌతున్నట్లు తెలియడంతో టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టిటిడి జేఈవో వీరబ్రహ్మంలతో కలిసి ఆయన తనిఖీలు చేపట్టారు. శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్లు పొందడానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, ఆటోవాలాల నుండి సరైన సహకారం లేదని తమ దృష్టికి వచ్చిందని ఈవో చెప్పారు. టిటిడి కల్పిస్తున్న సౌకర్యాలను ఆటోవాలాలు స్వప్రయోజనాలకు వాడుకుంటున్నట్లు, భక్తుల నుండి విచ్చలవిడిగా ఛార్జీలు వసూలు చేస్తున్న ట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు శాశ్వత పరిష్కార మార్గం దిశగా చర్యలు తీసుకుంటామని ఈవో తెలి పారు.

భక్తులకు టిటిడి కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించుకుని, మరింత మెరుగైన పటిష్టమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తిరుపతి నుండి శ్రీవారి మెట్టు మార్గం వరకు బస్సుల సంఖ్య పెంచ డాన్ని మరియు టోకన్ల జారీ కౌంటర్లను పెంచే అంశాలను పరిశీలిస్తామన్నారు. భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ సేకరించి పటిష్ట సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇదే సమయంలో వేసవిలో రద్దీ వేళ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జూన్ 15 వరకు ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. బ్రేక్ దర్శన వేళల్లో మార్పుల ద్వారా సామాన్య భక్తులకు అంచనాలకు తగినట్లుగానే దర్శనం వేగంగా అందుతోందని అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండిఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #TTD #Tirumala #DarshanTokens #TTDEO #DevoteesUpdate #SrivariDarshan #TirupatiNews #TempleUpdates